అక్షరటుడే, వెబ్డెస్క్ : KR Nagaraju | వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు – మల్లేశ్వరి దంపతులు తమ మిత్రుడి కుటుంబం పట్ల ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. తమ దివంగత స్నేహితుడు కీ.శే. కాలేశ్వరం ప్రకాశం – సుజాత దంపతుల ప్రథమ పుత్రుడు సూర్యదేవ వివాహం హిమాన్షితో హనుమకొండలోని కోడెం కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.
KR Nagaraju | పెళ్లి పెద్దగా బాధ్యతలు..

ఈ శుభకార్యానికి ఎమ్మెల్యే నాగరాజు (MLA Nagaraju) దంపతులు కేవలం అతిథిగా హాజరుకావడమే కాకుండా, మిత్రుడి కుటుంబానికి అండగా నిలబడ్డారు. స్వయంగా ‘పెళ్లి పెద్ద’ బాధ్యతలు స్వీకరించి, వివాహ వేడుకను ముందుండి నడిపించారు. పెళ్లి పీటల దగ్గర కూర్చొని వేద మంత్రాల నడుమ సంప్రదాయబద్ధంగా అన్ని పూజా కార్యక్రమాలను జరిపించారు.
KR Nagaraju | సొంత ఇంటి శుభకార్యంలా ..

మిత్రుడి కుమారుడి వివాహాన్ని తన సొంత ఇంటి వేడుకలా భావించి, ప్రతి ఒక్క పనినీ దగ్గరుండి పర్యవేక్షించడం అక్కడకు వచ్చిన బంధుమిత్రులను విశేషంగా ఆకట్టుకుంది. స్నేహానికి అత్యున్నత విలువనిస్తూ, ఆప్యాయతతో కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిన ఎమ్మెల్యే తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
KR Nagaraju | నూతన దంపతులకు ఆశీస్సులు..

వివాహ అనంతరం వధూవరులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దంపతులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. నూతన దంపతుల వైవాహిక జీవితం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, పరస్పర ప్రేమానురాగాలతో సాగాలని ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఆదర్శవంతంగా జీవించాలని కోరుకున్నారు.
ఇది కూడా చదవండి..: Daughter Murder Case | కొత్తూరులో ఘోరం.. ఫోన్ ఎక్కువగా చూస్తుందని కూతురినే చంపిన కసాయి తల్లి