WhatsApp Group Features | వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. గ్రూప్ చాటింగ్ మరింత ఈజీ అయ్యేలా 4 కొత్త ఫీచర్లు..

వాట్సాప్ గ్రూప్‌లలో నిత్యం వేల సంఖ్యలో వచ్చే మెసేజ్‌ల హోరులో ముఖ్యమైన విషయాలు మిస్ కాకుండా ఉండేందుకు, వాట్సాప్ నాలుగు సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : WhatsApp Group Features | వాట్సాప్ (WhatsApp) గ్రూప్‌లలో నిత్యం వేల సంఖ్యలో వచ్చే మెసేజ్‌ల హోరులో ముఖ్యమైన విషయాలు మిస్ కాకుండా ఉండేందుకు, యూజర్ల బిజీ లైఫ్‌స్టైల్‌ను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ నాలుగు సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. గ్రూప్ చాట్ మేనేజ్‌మెంట్‌ను మరింత సులభతరం చేసే ఈ అప్‌డేట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

WhatsApp Group Features | పిన్ చేసిన మెసేజ్‌లకు..

గ్రూప్‌లో ముఖ్యమైన సమాచారాన్ని పిన్ చేసే ఫీచర్ ఇప్పటికే ఉన్నప్పటికీ.. ఇంతకాలం అది గరిష్టంగా 30 రోజుల వరకు మాత్రమే ఉండేలా గడువు ఉండేది. కానీ తాజా అప్‌డేట్‌తో ఆ పరిమితులను తొలగించారు. ఇకపై గ్రూప్‌లో పంపిన కీలక మెసేజ్‌లను ఎలాంటి గడువు లేకుండా శాశ్వతంగా లేదా మీకు అవసరమైనంత కాలం పిన్ చేసి ఉంచుకోవచ్చు. దీంతో పాత చాట్‌లను కిందకు స్క్రోల్ చేయాల్సిన పని లేకుండా గ్రూప్ టాప్‌లోనే ఆ సమాచారం ఎప్పటికీ కనిపిస్తుంది.

WhatsApp Group Features | చాట్ హిస్టరీ షేరింగ్ ..

గ్రూప్‌లోకి కొత్తగా యాడ్ అయ్యే మెంబర్లకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. కొత్తగా చేరిన వారు అంతకుముందు గ్రూప్‌లో జరిగిన ముఖ్యమైన చర్చలు, సంభాషణలను ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా తెలుసుకునేలా ఈ ఫీచర్ తోడ్పడుతుంది.

WhatsApp Group Features | గ్రూప్ స్టేటస్ అప్‌డేట్స్ ..

సభ్యుల మధ్య కమ్యూనికేషన్‌ను మరింత సరదాగా, ఆసక్తికరంగా మార్చేందుకు వాట్సాప్ ఈ ఆప్షన్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా గ్రూప్ సభ్యులతో నేరుగా స్టేటస్‌లను పంచుకోవచ్చు. దీనివల్ల గ్రూప్‌లోని అందరూ మరింత కనెక్ట్ అయి ఉండేందుకు వీలవుతుంది.

WhatsApp Group Features | మెన్షన్స్ & రిప్లైస్ ఫిల్టర్ ..

ఎక్కువ గ్రూప్‌లలో యాక్టివ్‌గా ఉంటూ మెసేజ్‌ల బిజీలో ఉక్కిరిబిక్కిరి అయ్యేవారికి ఈ ఫిల్టర్ ఓ వరంలాంటిది. ఎవరైనా మిమ్మల్ని పర్సనల్‌గా ట్యాగ్ (Mention) చేసినా లేదా మీ మెసేజ్‌కు రిప్లై ఇచ్చినా.. ఆ వివరాలను మాత్రమే ప్రత్యేకంగా ఫిల్టర్ చేసి చూసే వెసులుబాటు ఈ ఫీచర్ ద్వారా లభిస్తుంది.

ఇది కూడా చదవండి..: tesla roadster | భూమిపైనే కాదు.. గాల్లోనూ రాకెట్ వేగం! గాల్లోకి ఎగిరి జంప్ చేసిన ‘టెస్లా రోడ్‌స్టర్’!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *