అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gajawada Brothers Join BJP | నిజామాబాద్(Nizamabad) నగరానికి చెందిన గజవాడ సోదరులు ఇద్దరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఎంపీ అర్వింద్‌ను (Dharmapuri Arvind) వారు మర్యాదపూర్వకంగా కలిశారు.
Gajawada Brothers Join BJP | ఆహ్వానించిన ఎంపీ
రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ గజవాడ హనుమంతరావు, అతని సోదరుడు మాజీ కార్పొరేటర్ సివిల్ ఇంజినీర్ గజవాడ గణేష్ గుప్తాలు బీజేపీలో చేరారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో ఇద్దరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గజవాడ సోదరులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వారితో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు, ఇంజనీర్లు బీజేపీలో చేరారు. నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ బలోపేతానికి పార్టీ ఆదేశానుసారం పని చేస్తానని పార్టీలో చేరిన గజవాడ హనుమంతురావు, గణేష్ గుప్తా తెలిపారు. గజవాడ హనుమంతురావు ప్రస్తుతం దిశ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. గజవాడ గణేష్ గుప్తా వైశ్య సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక సేవా రంగాలలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
Gajawada Brothers Join BJP | అర్బన్ ఎమ్మెల్యే గైర్హాజరు
భారతీయ జనతా పార్టీలో నగరానికి చెందిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు చేరిక సమయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీలో చేరుతుండగా లోకల్ ఎమ్మెల్యే హాజరుకాకపోవడంలో మతలబు ఏమిటని చర్చ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: రైతన్నలకు గుడ్ న్యూస్ అకౌంటల్లోకి రూ. 2 వేలు..