Wardhannapet Accident | బైక్​ను ఢీకొన్న కారు.. తండ్రీకొడుకులకు గాయాలు

వరంగల్​ జిల్లా వర్దన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Wardhannapet Accident | వరంగల్​ జిల్లా (Warangal district) వర్దన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్​పై వెళ్తున్న తండ్రీకుమారులను వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు.

గుగులోతు సురేష్, ఆయన కుమారుడు అభిరామ్ బైక్​పై బయటకు వచ్చారు. వర్దన్నపేటలో జాతీయ రహదారిపై ఓ పక్కన ఆగారు. అనంతరం రోడ్డుకు అవతలి వైపు వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు వారి బైక్​ను ఢీకొంది. దీంతో బైక్​తో సహా వారు కొంత దూరంలో ఎగిరిపడ్డారు. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Wardhannapet Accident | ఎంజీఎంకు తరలింపు

ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ (CCTV) కెమెరాలో నమోదయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌కు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Narsingi Road Alignment | రియల్​ ఎస్టేట్​ సంస్థ కోసం 2 వేల ఇళ్లు కూల్చే కుట్ర : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *