అక్షరటుడే వెబ్డెస్క్: Pioxazone Insecticide | భారతీయ ( India ) వ్యవసాయ రంగాన్ని కొత్త మలుపు తిప్పుతూ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నూతన పురుగుమందు అణువు ‘పియోక్సానిలిప్రోల్’ (Pioxaniliprole) తో కూడిన ‘పియోక్సాజోన్’ (పియోక్సానిలిప్రోల్ 20% ఎస్సీ) ను పై (PI) ఇండస్ట్రీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. పరిశోధన స్థాయి నుంచి వాణిజ్యపరమైన వినియోగం వరకు ప్రతీ దశను భారత్లోనే విజయవంతంగా పూర్తి చేసుకున్న తొలి పంట సంరక్షణ ఉత్పత్తిగా పియోక్సాజోన్ నిలిచింది.
Pioxazone Insecticide | పంటలకు భద్రతా కవచం..
దక్షిణ భారతదేశంలో రైతులకు జీవనాధారమైన వరి, మొక్కజొన్న, శనగ పంటలను ప్రధానంగా ఆశించే కిరాతక పురుగుల నుంచి ఇది పూర్తి రక్షణ కల్పిస్తుంది. వరి పంటను పాడుచేసే ‘పసుపు కాండం తొలిచే పురుగు’, మొక్కజొన్నను నాశనం చేసే ‘లద్దె పురుగు’ (ఫాల్ ఆర్మీవార్మ్), అలాగే శనగ పంటలోని ‘కాయ తొలిచే పురుగు’ (పాడ్ బోరర్) లను ఇది అత్యంత సమర్థవంతంగా అరికడుతుంది. సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ (CIB&RC) కూడా ఈ మందు వినియోగానికి అధికారిక అనుమతులు మంజూరు చేసింది.
Pioxazone Insecticide | వేగవంతమైన శోషణ శక్తి..
పియోక్సాజోన్ పంటలపై పిచికారీ చేసిన కేవలం 30 నిమిషాల్లోనే మొక్కల్లోకి శోషించబడుతుంది. దీనివల్ల మందు చల్లిన కొద్దిసేపటికే వర్షం పడినా దీని పనితీరు దెబ్బతినదు. వాతావరణంలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, దీని ప్రత్యేకమైన అణు నిర్మాణం చీడపీడలపై బలమైన ప్రభావం చూపిస్తూ సుదీర్ఘ కాలం పాటు పంటలకు రక్షణగా నిలుస్తుంది. అంతేకాకుండా, ఇది మొక్కల ఎదుగుదలను ప్రేరేపించే ఫైటోటానిక్ ప్రభావాన్ని కూడా అందిస్తుంది.
Pioxazone Insecticide | కీటకాలకు పూర్తి సురక్షితం..
చీడపీడలను సహజంగా వేటాడి తినే ప్రిడేటరీ స్పైడర్స్ (సాలీళ్లు), లేడీబర్డ్ బీటిల్స్ (ఆరుద్ర పురుగులు), డ్యామ్సెల్ఫ్లైస్ (తూనీగలు), గ్రీన్ లేస్వింగ్స్ వంటి పంటకు మేలు చేసే కీటకాలకు పియోక్సాజోన్ ఎలాంటి హానీ కలిగించదు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, సమగ్ర సస్యరక్షణ (IPM) విధానాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఉత్పత్తి భారతీయ రైతులకు ఎంతో దోహదపడుతుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న తమ డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల నెట్వర్క్ ద్వారా పియోక్సాజోన్ ను రైతులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురానున్నట్లు పై అగ్రిసైన్సెస్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Nizamabad Couple Assault Arrest | దంపతులపై దాడిచేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్