Choutuppal Murder Case | చౌటుప్పల్‌లో జోగిని దారుణ హత్య.. 60 తులాల బంగారం చోరీ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో జోగిని సుధాకర్​ను దుండగులు దారుణంగా హత్య చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Choutuppal Murder Case | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జోగినిగా పేరొందిన రాళ్లబండి సుధాకర్​ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఆయన ఇంట్లోని 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకొని పారిపోయారు.

చౌటుప్పల్​ బీసీ కాలనీకి చెందిన సుధాకర్​ (50) జోగినిగా పేరు పొందారు. ఆయనను పలువురు స్వామీజీగా కొలుస్తారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆయనను దుండగులు హత్య చేశారు. ఆయన కండ్ల‌లో పెప్పర్ స్ప్రే కొట్టి, కాళ్లు చేతులు కట్టేసి చంపేశారు. అనంతరం బీరువాను పగులకొట్టి 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం సుధాకర్​కు చెందిన స్కార్పియో వాహనంలోనే అక్కడి నుంచి పరారు అయ్యారు.

Choutuppal Murder Case | పట్టించిన కారు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్​ టీమ్​తో ఆధారాలు సేకరించారు. నిందితులు స్వామీజీ కారులో పరారు కావడంతో.. పోలీసులు ఆ కారులో ఉన్న జీపీ ఎస్​ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జీపీఎస్​తో కారు వెళ్తున్న మార్గాన్ని ట్రాక్​ చేసి, సిద్దిపేట సమీపంలో అరెస్ట్ చేసినట్లు సమాచారం. నిందితులను అస్సాంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారు కొంతకాలంగా సుధాకర్​ దగ్గర శిష్యులుగా పని చేస్తున్నట్లు సమాచారం.

దీనిని కూడా చదవండి : illegal egg donation | అండాల మాఫియా.. 49 మంది యువతులకు విముక్తి!.. 10 మంది అరెస్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *