అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vinayak Nagar Power Cut | నిజామాబాద్ నగరంలో (Nizamabad) సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ట్రాన్స్కో టౌన్–3 ఏడీఈ వినోద్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
Vinayak Nagar Power Cut | టవర్స్ బిగించే క్రమంలో..
33/11 కేవీ వినాయక్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో 33/11 కేవీ రైతు బజార్ ఇండోర్ సబ్‌స్టేషన్ లైన్ కోసం టవర్స్ బిగించే క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని అధికారి వినోద్ తెలిపారు.
11 కేవీ వినాయక నగర్ 2 ఫీడర్ పరిధిలో 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. పులాంగ్ పాత వంతెన నుంచి పులాంగ్ చౌరస్తా వరకు అలాగే హనుమాన్ నగర్లో సైతం పవర్ కట్ ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ అంతరాయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.
ఇది కూడా చదవండి: పండుగ వేళ బిగ్ షాక్..పెరిగిన కమర్షియల్ సిలిండర్ల ధరలు..