Florida Plane Crash | ఫ్లోరిడాలో కూలిపోయిన విమానం.. 9 మంది మృతి

ఫ్లోరిడాలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Florida Plane Crash | ఫ్లోరిడా (Florida)లో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న ఒక వ్యాపార విమానం ఆదివారం దక్షిణ ఫ్లోరిడాలో పేలిపోయింది.

రద్దీగా ఉండే రోడ్డుపై విమానం పడిపోయింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో విమానంలోని వారు అందరు ప్రాణాలు కోల్పోయారు. విమానం పడిపోతుండగా.. కార్లలో వెళ్తున్న వారు వీడియో తీశారు. ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.బహామాస్ వెళ్తున్న విమానం ఆకాశం నుండి దూసుకువచ్చి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో అక్కడ వాహనాలు లేకపోవడం ప్రాణనష్టం తగ్గింది.

Florida Plane Crash | దర్యాప్తుకు ఆదేశం

స్థానిక కాలమానం ప్రకారం పామ్ బీచ్ కౌంటీలో మధ్యాహ్నం 12:50 గంటలకు లీర్‌జెట్ 60 కూలిపోయిందని రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ పేర్కొన్నారు. ఈ ఘటనను భయంకరమైన విషాదంగా అభివర్ణించారు. జాతీయ రవాణా భద్రతా మండలి దర్యాప్తుకు మద్దతుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక బృందాన్ని పంపుతోందని ఆయన తెలిపారు. విమానం పడిన సమయంలో రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.

ఇది కూడా చదవండి..: Bangladesh transit corridor protests | భారత్‌కు ట్రాన్సిట్ కారిడార్​పై బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షాల తీవ్ర ఆగ్రహం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *