అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajasthan Electric Shock | రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పనుల్లో భాగంగా భారీ యంత్రానికి విద్యుత్ తీగలు తగలడంతో.. కరెంట్ షాక్‌తో 8 మంది కార్మికులు మృతి చెందారు.
రాజస్థాన్ (Rajasthan)లోని ఝున్ఝును జిల్లా చపోలిలో రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం రహదారి నిర్మాణ సామగ్రిని కలిపే యంత్రం (మిక్సింగ్ మెషీన్) 11 వేల వోల్టుల విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో సమీపంలో పని చేస్తున్న కార్మికులకు షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సమాచారం అందుకున్న కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Rajasthan Electric Shock | నలుగురికి తీవ్రగాయాలు
ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి ఖచ్చితమైన సంఖ్యపై అధికారిక ధృవీకరణ ఇంకా అందాల్సి ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించారు.\
ఇది కూడా చదవండి..: INDIA Alliance Rally | ఇండియా కూటమి ర్యాలీతో రూ.11 వేల కోట్ల నష్టం