BPT Rice Price | బీపీటీ బియ్యం కిలో రూ.66కే విక్రయించాలి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: BPT Rice Price | జిల్లాలో బీపీటీ బియ్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం కిలో రూ.66కే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఎ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం) నాయకులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి (Collector Ila Tripati)కి వినతిపత్రం అందజేశారు.

BPT Rice Price | సామాన్యలుపై ఆర్థిక భారం..

మిల్లర్లు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులు బీపీటీ బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని ఎంఐఎం నాయకులు పేర్కొన్నారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బియ్యం అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌, అధిక ధరలకు విక్రయించడంపై హెచ్చరికలు జారీ చేశారని గుర్తుచేశారు. సాధారణంగా వినియోగించే బీపీటీ బియ్యం ధర కిలో రూ.66గా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగా తనిఖీలు నిర్వహిస్తూ ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

BPT Rice Price | అధిక ధరలకు అడ్డగోలుగా విక్రయం..

జిల్లాలో కొందరు బియ్యం మిల్లర్లు, వ్యాపారులు, హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణదారులు మార్కెట్‌ పరిస్థితులను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. గతంలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న బియ్యాన్ని ప్రస్తుతం గణనీయంగా పెంచిన ధరలకు అమ్ముతున్నారని తెలిపారు. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు, బియ్యం మిల్లర్లు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.   కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్​, డిప్యూటీ మేయర్​ షకీల్​ అహ్మద్​, అమర్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: School Grants | పీఎఫ్ఎంఎస్ విధానానికి స్వస్తి.. స్కూళ్లలో హెచ్​ఎంలకు కొత్త తిప్పలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *