అక్షరటుడే, ఇందూరు: Amit Shah Hyderabad Rally | హైదరాబాద్‌లో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సోమవారం మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో నిజామాబాద్(Nizamabad) అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) పాల్గొన్నారు.
Amit Shah Hyderabad Rally | మోజాంజాహీ మార్కెట్ వరకు..
అమిత్‌షాతో కలిసి నిజాం కళాశాల నుంచి మోజాంజాహీ మార్కెట్ వరకు నడిచారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భాగ్యనగరానికి రావడంతో తెలంగాణ బీజేపీలో ఉత్సాహం ఉరకలెత్తిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఎస్ఐఆర్పై రాహుల్ గాంధీ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టేందుకే అమిత్ షా భాగ్యనగరానికి విచ్చేశారన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ గవర్నర్‌తో భాగ్యలక్ష్మి ఆలయ ట్రస్టీ భేటీ