Food Safety Inspections | కామారెడ్డి రెస్టారెంట్లపై ఫుడ్​సేఫ్టీ అధికారుల తనిఖీలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Food Safety Inspections | జిల్లా కేంద్రంలో(Kamareddy) ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత అధికారి విక్రమ్ కామారెడ్డి పట్టణంలోని అల్ సుభాన్ రెస్టారెంట్‌ను తనిఖీ చేశారు.

Food Safety Inspections | కృత్రిమ ఆహార రంగులు..

చికెన్ కూరలు, ఫ్రైడ్ రైస్ తదితర వంటకాల తయారీలో అనుమతిలేని కృత్రిమ ఆహార రంగులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వంటశాల అపరిశుభ్రంగా ఉండటం, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, సిబ్బంది తల కవర్లు, చేతి తొడుగులు, ఆప్రాన్లు ధరించకపోవడం వంటి లోపాలను గుర్తించారు. సుమారు 15 కిలోల నిల్వ ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేసి, అనుమానిత నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. సంబంధిత సంస్థకు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం ప్రకారం నోటీసు జారీ చేశారు.

అదేవిధంగా ఎస్‌ఎస్‌ఎస్ టిఫిన్ సెంటర్‌ను తనిఖీ చేయగా వంటశాల అపరిశుభ్రంగా ఉండటం, వ్యర్థాల నిర్వహణ లోపాలను గుర్తించి మెరుగుదల నోటీసు జారీ చేశారు. నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆహార భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, వంటశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన ముడి పదార్థాలు వినియోగించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ రంగులు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: రక్షక భటులే భక్షకులుగా..న్యాయం కోసం వెళ్తే అఘాయిత్యం.. 

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *