అక్షరటుడే, వెబ్డెస్క్: AP assigned land freehold rules | ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh రాష్ట్రంలో భూముల యాజమాన్య హక్కులు, ల్యాండ్ రికార్డులకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి చెక్ పెడుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
అసైన్డ్, చుక్కల, ఇనాం మరియు పట్టా భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ (Freehold) కోసం పెట్టుకునే దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు కాలపరిమితులు విధిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక జీవో (GO) జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులకు, భూ యజమానులకు ఊరట లభించనుంది.
AP assigned land freehold rules | ఆర్డీఓ, తహసీల్దార్ల స్థాయిలో 60 రోజుల గడువు!
ఫ్రీహోల్డ్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO), తహసీల్దార్ (Tahsildar) స్థాయిల్లో వచ్చే ఫ్రీహోల్డ్ దరఖాస్తులను గరిష్టంగా 60 రోజుల్లోగా (రెండు నెలలు) పరిశీలించి పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అధికారులు నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులను పెండింగ్లో ఉంచకూడదని వెల్లడించింది.
AP assigned land freehold rules | 22A తొలగింపునకు ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు!
ఈ జీవోలో ప్రభుత్వం మరో అతిపెద్ద సడలింపు ఇచ్చింది. నిషేధిత భూముల జాబితా (Section 22A) నుంచి ఈ భూములను తొలగించడానికి ప్రతీసారీ వేరే ప్రత్యేక ఉత్తర్వులు (Orders) అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఫ్రీహోల్డ్ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన భూములకు సంబంధించిన ప్రక్రియ పూర్తవ్వగానే 22A జాబితా నుంచి నేరుగా మినహాయింపు లభించేలా యంత్రాంగానికి స్పష్టతనిచ్చింది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
ఈ కీలక నిర్ణయంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్న రైతులకు భారీ ఉపశమనం లభించడంతో పాటు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా ముగిసేందుకు మార్గం సుగమమైంది.