అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Stock Market Rally | దిగివస్తున్న ముడిచమురు ధరలు, కంపెనీల బలమైన త్రైమాసిక ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తున్నాయి. దీనికితోడు దేశీయ స్టాక్‌మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, దేశీయ మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి స్టాక్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) రద్దు చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. దీంతో ప్రధాన సూచీలు దూసుకెళ్తున్నాయి.
Indian Stock Market Rally | లాభాలతో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 596 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మొదట్లో కాస్త దిద్దుబాటుకు గురై 255 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి పుంజుకుని 535 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 100 పాయింట్లు తగ్గింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 193 పాయింట్లు పైకి ఎగబాకింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 879 పాయింట్ల లాభంతో 76,572 వద్ద, నిఫ్టీ 235 పాయింట్ల లాభంతో 23,675 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 22 స్టాక్స్ లాభాలతో, 8 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఆసియన్ పెయింట్స్ 3.83 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.97 శాతం, ఇండిగో 2.50 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.32 శాతం, హెచ్యూఎల్ 2.28 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎన్టీపీసీ 1.08 శాతం, పవర్‌గ్రిడ్ 0.68 శాతం, రిలయన్స్ 0.65 శాతం, టాటా స్టీల్ 0.48 శాతం, ట్రెంట్ 0.36 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Karur Vysya Bank Branches | కరూర్ వైశ్య బ్యాంక్ భారీ విస్తరణ.. తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాల్లో 8 కొత్త శాఖలు ప్రారంభం