MLA Rajagopal Reddy | నిధుల కేటాయింపులో వివక్ష.. మంత్రి ఉత్తమ్​పై రాజగోపాల్​రెడ్డి ఫైర్​

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: MLA Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన తాజాగా.. మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని టార్గెట్ చేశారు.

నిధుల కేటాయింపులో మంత్రి ఉత్తమ్​ (Minister Uttam) వివక్ష చూపుతున్నారని రాజగోపాల్​రెడ్డి ఆరోపించారు. ఆయన హుజుర్​నగర్​కు మంత్రా.. లేక రాష్ట్రానికి మంత్రా అని ప్రశ్నించారు. నిధులను కోదాడా, హుజుర్​నగర్​కు తీసుకు వెళ్తున్నారని, ఇతర నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదన్నారు. తాను ప్రతిపాదనలు పంపినా నిధులు ఇవ్వడం లేదన్నారు. తనకు రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లు ఇస్తే మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. అయితే ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలా నిధులు అడుక్కోవాల్సి వస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో పూడిక తీసిన చెరువుల్లో నీళ్ళు నిలిచి ఇప్పుడు రైతులకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.

MLA Rajagopal Reddy | పవర్​ ఫుల్ నాయకుడిని..

తాను సీఎం, మంత్రి కాకపోవచ్చు కానీ గుణంలో వాళ్లకంటే వంద రెట్లు గొప్ప అని రాజగోపాల్​రెడ్డి అన్నారు. మంత్రి, సీఎం కంటే పవర్‌ఫుల్ నాయకుడిని అంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ హుజూర్ నగర్, కోదాడలో 100 ఎకరాలు ఉంటే చాలు.. లిఫ్ట్ స్కీమ్‌లు ఏర్పాటు చేస్తున్నారని, కానీ ఫ్లోరైడ్ పీడిత మునుగోడు నియోజకవర్గానికి మాత్రం సాగునీటి ప్రాజెక్టుల కోసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Sangareddy Car Accident | విద్యుత్​ స్తంభాన్ని ఢీకొన్న కారు.. దంపతుల మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *