అక్షరటుడే, వెబ్డెస్క్: Ventilators Theft | ఆదిలాబాద్ (Adilabad) రిమ్స్ ఆసుపత్రి నుంచి నాలుగు వెంటిలేటర్లు చోరీకి గురయ్యాయి. అక్టోబర్ 30న ఆర్‌ఐసీయు ఛాతీ వార్డు నుంచి రెండు, టీబీ వార్డు నుంచి మరో రెండు వెంటిలేటర్లను ఎత్తుకెళ్లారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు వైద్య సేవలు అందించే పరికరాలను ఎత్తుకెళ్లడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అక్టోబర్ 30న ఈ చోరీ జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు వెంటిలేటర్లను తీసుకు వెళ్తున్నట్లు కనిపించింది.
Ventilators Theft | సిబ్బందికి మెమోలు
ఆస్పత్రిలో అందరు ఉండగానే వెంటిలేటర్లు చోరీకి గురవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆసుపత్రి అధికారులు డ్యూటీ డాక్టర్లు, భద్రతా సిబ్బందితో సహా 10 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: RIMS Accident | రిమ్స్ ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య.. మరో 20 మంది నవజాత శిశువుల పరిస్థితి విషమం!