అక్షరటుడే, వెబ్డెస్క్ : AP Local Elections | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఓటు వేసేందుకు ఉదయం నుంచి ఓటర్లు లైన్లలో వేచి ఉన్నారు. అయితే ఏజెన్సీ గ్రామాల ప్రజలు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి ఓటు వేసి, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలోని మారుమూల కొండ గ్రామాలకు చెందిన 18 మంది ఓటర్లు తమ గ్రామాలకు రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నినాదాలు చేస్తూ.. ర్యాలీగా కొండ ప్రాంతాల నుంచి పోలింగ్ కేంద్రానికి బయలు దేరారు. ఈ మేరకు వీడియో వైరల్ అవుతోంది. తాము రోడ్ల కోసమే ఓటు వేస్తున్నామని నినాదాలు చేస్తూ, తాత్కాలిక డోలీలలో వృద్ధులను మోసుకుంటూ గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు వచ్చారు.
AP Local Elections | మొదటి సారి..
వారు మాట్లాడుతూ.. తమ గ్రామాలకు రోడ్డు వేయాలని, మొదటి సారి ఓటు వేస్తున్నామని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అవుతున్న తమకు రోడ్డు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఇదే మొదటిసారి అని గ్రామస్తులు తెలిపారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూసేందుకు, వృద్ధులను డోలీలలో మోసుకుంటూ తమతో పాటు తీసుకువెళ్లారు. కాగా ఆ గ్రామాలకు మోటారు వాహనాలు వెళ్ళే రోడ్ల సౌకర్యం ఇప్పటికీ లేదు.
ఇది కూడా చదవండి..: Madanapalle Land Grab | నకిలీ పత్రాలతో భూ ఆక్రమణలు.. మదనపల్లె ‘లేడీ డాన్’ సులోచన అరెస్ట్