Bandari Naresh Appointment | బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా బండారి నరేష్​

బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా, రూరల్​ ఇన్​ఛార్జీగా బండారి నరేష్ నియమితులయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bandari Naresh Appointment | బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా, రూరల్​ ఇన్​ఛార్జీగా బండారి నరేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ​బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులుతో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు.

Bandari Naresh Appointment | బీసీ సంఘం బలోపేతానికి..

జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ మాట్లాడుతూ.. బీసీ సంఘం బలోపేతం చేయడంలో భాగంగా సంఘం పటిష్ట నిర్మాణాన్ని చేయాలని జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారన్నారు. ఆయన సూచనల మేరకు గురువారం బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిగా, నిజామాబాద్ (Nizamabad) రూరల్ నియోజకవర్గం ఇన్​ఛార్జీగా బండారి నరేష్​ను నియమించామన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే పెద్దదైన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బండారి నరేష్ నియామకంతో సంఘం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు దర్శనం దేవేందర్, కొయ్యడ శంకర్, దేశాయి గంగాధర్, అంకం రావు, బాలన్న, హన్మాండ్లు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Dharpally Area Hospital | డిసెంబర్​లోగా ధర్పల్లి ఏరియా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *