School Inspection | విద్యార్థులు పాఠ్యాంశాలను నిత్యసాధన చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

విద్యార్థులు అన్ని పాఠ్యాంశాలు నిత్యం సాధన చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. కోనరావుపేటలోని కేజీబీవీని తనిఖీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: School Inspection | విద్యార్థులు అన్ని పాఠ్యాంశాలు నిత్యం సాధన చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) ఆకాంక్షించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంలో గురువారం తనిఖీ చేశారు.

School Inspection | పాఠశాల క్షుణ్ణంగా పరిశీలన..

ముందుగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను కలెక్టర్​ పరిశీలించారు. కిచెన్​లో మెనూ చార్ట్ పరిశీలించి.. దానికి అనుగుణంగా భోజన పదార్థాలు సిద్ధం చేస్తుండగా తనిఖీ చేశారు. కూరగాయలు, బియ్యం, పప్పుల నాణ్యత పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఒక ప్రణాళిక ప్రకారం అన్ని పాఠ్యాంశాలను చదవడం, రాయడం సాధన చేయాలని పేర్కొన్నారు. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏదైనా ఉద్యోగం, స్వయం ఉపాధిలో స్థిరపడాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో తహశీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధ, జీసీడీవో పద్మజ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana University Exams | 13 నుంచి డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *