అక్షరటుడే, ఆర్మూర్: Armoor Municipal Meeting | ఆర్మూర్ మున్సిపల్ (Armoor Municipal) సాధారణ సమావేశం వాక్అవుట్లు, నిరసనల మధ్య గురువారం జరిగింది. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం మున్సిపల్ సాధారణ సమావేశాన్ని ఛైర్పర్సన్ గోనె లహరి అధ్యక్షతన నిర్వహించారు.
Armoor Municipal Meeting | 28 ఎజెండా అంశాలపై తీర్మానాలు..
ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు 28 ఎజెండా అంశాలను చదివి వినిపించగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆర్మూర్ నూతన మున్సిపల్ భవనానికి నిధులు మంజూరు కాగా.. ప్రస్తుతం మున్సిపల్ భవన స్థలంలోనే నూతన భవనం నిర్మాణం చేపట్టాలని తీర్మానించారు. ఎల్నినో ఎఫెక్ట్ కారణగా మున్సిపల్ పరిధిలోని కాలనీలో నీటిని పొదుపుగా వాడేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తీర్మానించారు.
Armoor Municipal Meeting | బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల వాకౌట్..
సిద్దులగుట్ట వెనుక ప్రాంతంలో నాలుగు గుంటల ప్రభుత్వ స్థలం కబ్జా చేసి పెట్రోల్ బంకు నిర్మిస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ సభ్యలు ఆరోపించారు. అలాగే ఆర్మూర్ అటవీశాఖ కార్యాలయం ప్రాంతంలో నాలుగున్నర ఎకరాల భూమిని కబ్జాచేసి అమ్ముకొంటున్న అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. దీనిని నిరసిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు సభ నుంచి వాకౌట్ చేశారు. అదేవిధంగా గత సాధారణ సమావేశంలో తీర్మానం చేసిన ఏజెండా అంశాల్లోని పనులు పూర్తి చేయకుండానే తిరిగి ఈ సాధారణ సమావేశంలో మరిన్ని పనులకు తీర్మానాలు చేయడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. ఏజెండా పత్రాలను చింపివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. మరోవైపు పట్టణంలో కోతుల, కుక్కల బెడదపై మున్సిపల్ అధికారుల తీరును వారు తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Hospital Regulations | నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి