అక్షరటుడే వెబ్‌డెస్క్: Kerala Gold Smuggling | కేరళలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా ఓ మహిళ ఆడిన కిడ్నాప్ డ్రామా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తలస్సేరి ప్రాంతానికి చెందిన ప్రియాంక అనే మహిళ దుబాయ్ నుంచి 14 తులాలకు పైగా బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తీసుకువచ్చింది. నిబంధనల ప్రకారం ఎయిర్‌పోర్ట్ వెలుపల వేచి ఉన్న జాబీర్ అనే వ్యక్తికి ఈ బంగారాన్ని అప్పగించాల్సి ఉంది.
Kerala Gold Smuggling | కిడ్నాప్ నాటకం..
అయితే, తీసుకువచ్చిన బంగారాన్ని కాజేయాలని భావించిన ప్రియాంక, మరో ఇద్దరితో కలిసి ఒక ముందస్తు పథకం రచించింది. తాను చెప్పిన ప్లాన్ ప్రకారం.. ప్రియాంక ఎయిర్‌పోర్ట్ బయటకు రాగానే, ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేసినట్లు నటించి వేగంగా పరారయ్యారు.
Kerala Gold Smuggling | 12 కిలోమీటర్ల ఛేజింగ్ ..
కారు వేగంగా వెళ్తుండటం, బంగారం కోసం వచ్చిన జాబీర్ ఆ కారు వెనకాల పరిగెత్తడం గమనించిన ఒక ఎయిర్‌పోర్ట్ అధికారి అలర్ట్ అయ్యారు. నిజంగానే మహిళ కిడ్నాప్‌కు గురైందని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కారును దాదాపు 12 కిలోమీటర్ల మేర ఛేజ్ చేసి నిందితులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. వారిని సుదీర్ఘంగా విచారించడంతో ఈ కిడ్నాప్ డ్రామా వెనక ఉన్న బంగారం స్మగ్లింగ్ అసలు రంగు బయటపడింది.
Kerala Gold Smuggling | ఏమీ తెలియని భర్త..
ఈ డ్రామాను పక్కాగా రక్తి కట్టించేందుకు ప్రియాంక తన భర్త, పిల్లలను కూడా ఎయిర్‌పోర్టుకు రప్పించింది. అయితే, తన భార్య బంగారం స్మగ్లింగ్ చేస్తున్న విషయంగానీ, కిడ్నాప్ నాటకం ఆడుతున్న విషయంగానీ భర్తకు అస్సలు తెలియదు. ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చి కళ్లముందే భార్య కిడ్నాప్ కావడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.
చివరకు ప్రియాంకతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరు ముఠా సభ్యులను, అలాగే స్మగ్లింగ్ కోసం ఆమెను దుబాయ్ పంపిన జాబీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీని దాటి బంగారం బయటకు ఎలా వచ్చింది, ఆమె ఎక్కడ దాచిపెట్టిందనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.
లేడీ స్మగ్లర్ కిడ్నాప్ డ్రామా..కట్ చేస్తే..
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తెచ్చిన ఓ మహిళ, దాన్ని తన వద్దే ఉంచుకోవాలనే ఉద్దేశంతో కిడ్నాప్ నాటకానికి తెరలేపినట్లు సమాచారం. కేరళ ఎయిర్‌పోర్ట్ నుంచి కారులో వెళ్లిన ఆమెను పోలీసులు 12 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. విచారణలో కిడ్నాప్ డ్రామా వెనుక బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. ఈ కేసులో మహిళతో పాటు ఆమెకు సహకరించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కథనం పేర్కొంది.
#goldsmuggling #keralaairport #dubai #kidnappingdrama #kerala #customs #policeinvestigation #crimenews #indiacrime #goldseizure #breakingnews #crimeupdate #aksharatoday
— Akshara Today | Telugu News (@AksharaToday) November 5, 2026
ఇది కూడా చదవండి: School Development | ప్రభుత్వ విద్యాలయాల్లో సకల సౌకర్యాలు..: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్