అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Family Insurance | రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ నెల 19న ప్రారంభించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న ప్రారంభించాలని నిర్ణయించారు. బీమా పథకం క ఇంద ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా లభిస్తుంది. నవంబర్ 19న సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
Indiramma Family Insurance | నవంబర్ 20 నుంచి దరఖాస్తులు
ఈ పథకంలో నమోదు ప్రక్రియ కోసం నవంబర్ 20 నుండి 30 వరకు ‘ఇందిరమ్మ కమిటీలు’ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి దరఖాస్తులను సేకరిస్తాయి. ఆ తర్వాత, తహశీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఈ దరఖాస్తులను పరిశీలించి, ప్రక్రియను పూర్తి చేస్తారు. అనంతరం అర్హులకు బీమా సౌకర్యం కల్పిస్తారు.
Indiramma Family Insurance | రైతు బీమా ఉంటుందా..
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ బీమా పథకాన్ని తీసుకొస్తామని బడ్జెట్లోనే చెప్పింది. తాజాగా పథకం అమలుకు అడుగులు వేస్తోంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే అనేక సామాజిక బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త పథకం ప్రారంభించాక వాటిని కొనసాగిస్తారా.. లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో రైతు బీమా పథకం తీసుకొచ్చారు. భూమి ఉన్న ప్రతి రైతుకు (59 ఏళ్ల వరకు) బీమా కల్పించారు. ఏ కారణం చేత రైతు మరణించినా.. రూ.5 లక్షల ఆర్థిక సాయం అందింది. ఈ పథకం కింద ఒకే కుటుంబంలో చాలా మంది బీమాకు దరఖాస్తులు చేసుకున్నారు. తమ భూమిని అందరి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి.. ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మంది రైతు బీమాకు అర్హుల అయ్యారు. దీంతో ప్రభుత్వం ఎల్ఐసీకి భారీగా ప్రీమియం కట్టేది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. రైతు బీమా ప్రీమియం కట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో కొత్తగా కుటుంబ బీమా పథకం తీసుకొస్తే రైతు బీమా ఉంటుందా.. ఆ పథకాన్ని ఎత్తేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Indiramma Family Insurance | తగ్గనున్న ఆర్థిక భారం
రాష్ట్రంలో ఇప్పటికే రైతు బీమాతో పాటు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఇతర రంగాల వారికి ప్రత్యేక బీమా పథకాలు ఉన్నాయి. కొత్తగా కుటుంబ బీమా పథకం తీసుకొచ్చాక.. వీటిని కొనసాగిస్తారా.. లేక తొలగిస్తారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అన్నింటిని తొలగించి ఒకే పథకాన్ని కొనసాగిస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గనుంది. అయితే కుటుంబ బీమా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు వచ్చాక పూర్తి స్పష్టత ఉంది.
ఇది కూడా చదవండి..: YSR Jagan KTR Vijay | ఒకే ఫ్రేమ్‌లో పొలిటికల్ & సినీ దిగ్గజాలు.. చెన్నై పెళ్లి వేడుకలో జగన్, కేటీఆర్, విజయ్ సందడి!