అక్షరటుడే వెబ్‌డెస్క్: Karmabhoomi Express Fire | పంజాబ్ నుంచి బిహార్ వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్ (Karmabhoomi Express) రైలులో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని పటియాలా జిల్లా రాజ్‌పురా సమీపంలో ఉన్న సరాయ్ వంజారా గ్రామం వద్ద రైలు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును వెంటనే నిలిపివేయడంతో, ప్రయాణికులందరూ కిందకు దిగి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధ్రువీకరించారు.
Karmabhoomi Express Fire | 5 భోగీలకు విస్తరణ..
రైలులోని ప్యాంట్రీ కార్ నుంచి మొదట మంటలు చెలరేగి, ఆ తర్వాత పక్కనే ఉన్న మరో నాలుగు బోగీలకు వ్యాపించినట్లు పటియాలా డిప్యూటీ కమిషనర్ (DC) హిమాంశు అగర్వాల్ వెల్లడించారు. మొత్తం ఐదు భోగీలు మంటల్లో కాలినట్లు సమాచారం. అయితే, మంటలు రాగానే ఫైర్ అలారం మోగడంతో ప్రయాణికులు వెంటనే అలర్ట్ అయ్యారని తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
Karmabhoomi Express Fire | ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం..
ప్రమాద సమయంలో ఆకాశాన్ని తాకేలా పొగలు రావడం, ప్రయాణికులు ప్రాణభయంతో పట్టాల పక్కన నిలబడటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పండుగల సీజన్ కావడం వల్ల రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దుర్ఘటనపై స్పందించిన భారతీయ రైల్వే , ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
A massive fire broke out in four coaches of the Karmabhoomi Express near Rajpura, Punjab. Passengers were evacuated safely and no casualties have been reported https://t.co/BEogOB9cUz
— Surajit (@surajit_ghosh2) November 6, 2026
ఇది కూడా చదవండి: Indian Stock Market | ఏడో రోజూ పైపైకి.. భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు