అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KBR Park Traffic Diversions | హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు సమీపంలో స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. దీంతో ఆ మార్గంలో కొన్ని నెలల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్ మీదుగా ఎన్ఎఫ్సీఎల్ వరకు జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా, రాబోయే కొన్ని నెలల పాటు ఎన్ఎఫ్సీఎల్, కేబీఆర్ పార్క్ ప్రవేశ జంక్షన్ (గేట్-1) మరియు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలసీఉలు తెలిపారు. ప్రయాణికులు బంజారా హిల్స్, రోడ్ నెం. 2 ను తప్పించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.
KBR Park Traffic Diversions | ఈ మార్గాల్లో వెళ్లాలి
ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్/రోడ్ నెం. 36, 45 & కేబుల్ బ్రిడ్జికి వెళ్లేవారు రోడ్ నెం. 1 మీదుగా 1/10 జంక్షన్ (సిటీ సెంటర్ మాల్) → రోడ్ నెం. 10 → జహీరా నగర్ → బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ → అగర్సేన్ ఐలాండ్ → భారతీయ విద్యా భవన్ → రోడ్ నెం. 45 జంక్షన్ మీదుగా వెళ్లాలి. రోడ్ నెం. 36 & 45 నుంచి NFCL/పంజాగుట్ట వెళ్లేవారు చెక్ పోస్ట్, వెంకటగిరి, రోడ్ నెం. 2, యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్, అమీర్‌పేట్, శ్రీనగర్ అడ్డాలోన్ రోడ్ నుంచి పంజాగుట్ట చేరుకోవాలి. మసబ్ ట్యాంక్ నుంచి శ్రీనగర్ కాలనీ, కమలాపురి కాలనీ, ఇందిరానగర్, కృష్ణ నగర్ & యూసుఫ్‌గూడకు వచ్చేవారు విరించి హాస్పిటల్ వద్ద లైఫ్ట్కు మళ్లాలి. రోడ్ నెం. 12, టీజీఐసీసీసీ భవనం, అగర్సేన్ ఐలాండ్, రోడ్ నెం. 45 జంక్షన్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెం. 2 మీదుగా రాకపోకలు సాగించాలని పోలీసులు సూచించారు.
KBR Park Traffic Diversions | రద్దీ సమాయాల్లో వెళ్లొద్దు
ఈ మార్గంలో ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుండి 9 గంటల వరకు రద్దీ అధికంగా ఉంటుంది. ఆ సమయంలో ఇతర మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రద్దీ సమయాల్లో భారీ వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించొద్దన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తామన్నారు.
దీనిని కూడా చదవండి : Woman Murder Case | మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు