అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sirpur Silk Workers | కాగజ్ నగర్‌లోని సర్ సిల్క్ సంస్థ కార్మికులు క్వార్టర్స్ ఖాళీ చేసేది లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. 25 ఏళ్లుగా అక్కడే ఉంటున్న వాళ్లను వారం రోజుల్లో ఖాళీ చేయమంటే ఎలా అని ప్రశ్నించారు.
కవిత మాట్లాడుతూ.. కాగజ్ నగర్ నియోజకవర్గం ఒకప్పుడు పరిశ్రమలకు పెట్టింది పేరన్నారు. సర్ సిల్క్ సంస్థ మూతపడిన తర్వాత కార్మికులకు రావాల్సిన చాలా బకాయిలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయన్నారు. కంపెనీ మూతపడిన సరే కంపెనీకి చెందిన క్వార్టర్స్ లోనే 5 వేల మంది కార్మికులు ఉంటున్నారని చెప్పారు. 25 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న వారిని ఇప్పుడు వారం రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారన్నారు.
Sirpur Silk Workers | ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి..
సర్ సిల్క్ సంస్థ (Sirpur Silk Workers) స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి ఇప్పుడు కార్మికులను క్వార్టర్స్ ఖాళీ చేయాలని అంటున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు వచ్చిన వాళ్లలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కూడా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంస్థకు చెందిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి కార్మికుల ఇళ్లను ఖాళీ చేయాలని అంటున్నారన్నారు. బకాయిలు పెండింగ్ లో ఉన్న సరే కార్మికులు అక్కడే ఉన్నారని, ఇప్పుడు ఖాళీ చేయాలని అంటే 5 వేల మంది కార్మికుల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు.
కాగజ్‌నగర్ సర్ సిల్క్ కార్మికుల క్వార్టర్స్‌ను ఖాళీ చేయించేందుకు ఒప్పుకునేది లేదు
25 ఏళ్లుగా నివసిస్తున్న 5 వేల మంది కార్మికులను వారం రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలనడం అన్యాయం. కార్మికుల నివాస హక్కులను కాపాడాలని, వారికి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు డిమాండ్ చేశారు.
కార్మికులకు నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని, స్థానిక నాయకత్వంతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
— Telangana Rakshana Sena (@TRSparty_HQ) November 6, 2026
దీనిని కూడా చదవండి : Lakdikapul One Way | లక్డీకాపూల్‌లో వన్-వే అమలుకు కసరత్తు