Ramadugu Chain Snatching | రామడుగులో చైన్​స్నాచింగ్ కలకలం..

కొన్నిరోజులుగా సైలెంట్​గా ఉన్న చైన్​స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Ramadugu Chain Snatching | కొన్నిరోజులుగా సైలెంట్​గా ఉన్న చైన్​స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. ధర్పల్లి(Dharpally) మండలం రామడుగు గ్రామంలో మహిళ గొలసును ఎత్తుకెళ్లారు.

Ramadugu Chain Snatching | ధర్పల్లి మండలం రామడుగు..

ధర్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన గడ్డం పద్మ తన ఇంటి నుండి నిజామాబాద్ వెళ్లేందుకు బస్​స్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్యక్తి టీవీఎస్ మోటార్ సైకిల్‌పై ఎదురుగా వచ్చి ఆమె మెడలోని సుమారు 3 తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడి నుండి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు తమకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. నిందితుడిని త్వరితగతిన గుర్తించి పట్టుకునేందుకు పోలీసు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టామని, నిందితుడి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో విచారణ చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలంటే 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *