Police Extortion | అరెస్ట్ చేస్తామని బెదిరించి రూ.50 వేలు వసూలు

ఓ వ్యక్తిని అరెస్ట్ చేస్తామని బెదిరించి ఇద్దరు వ్యక్తులు రూ.50 వేలు వసూలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Police Extortion | ఓ వ్యక్తిని అరెస్ట్ చేస్తామని బెదిరించి ఇద్దరు వ్యక్తులు రూ.50 వేలు వసూలు చేశారు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలోని షేక్​పేట నాలా జంక్షన్​ సమీపంలో చోటు చేసుకుంది. నవంబర్ 4న సాయంత్రం 6:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి గుంటటి సత్యనారాయణకు ఎస్​బీఐలో గోల్డ్​ లోన్​ ఉంది. దానిని తిరిగి చెల్లించేందుకు తన గోపన్నపల్లికి చెందిన తన స్నేహితుడు సాగర్‌ దగ్గర రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ నెల 4న షేక్‌పేట నాలా జంక్షన్ వద్ద ఆ నగదు ఇచ్చాడు. అయితే ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు అతడిని గమనించారు. బ్యాగులో డబ్బులు పెట్టుకుంటుంగా వచ్చి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తామని బెదిరించారు. వదిలిపెట్టడానికి రూ. 70,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Police Extortion | ఆలస్యంగా ఫిర్యాదు

తాము పోలీసులం అని చెప్పుకొని నిందితులు డబ్బులు డిమాండ్​ చేశారు. బాధితుడు బతిమిలాడటంతో రూ.50 వేలు తీసుకొని, అతడి ఫోన్​ నంబర్​ రాసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారి పేర్లు మల్సూర్, మోహన్ అని బాధితుడు పేర్కొన్నారు. వారిద్దరినీ తాను గుర్తు పట్టగలనని పోలీసులకు తెలిపారు. అయితే ఆ ఘటనతో తాను భయాందోళనకు గురయ్యానని చెప్పారు. అందుకే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని తెలిపారు. ఈ ఘటనపై శుక్రవారం ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Ramadugu Chain Snatching | రామడుగులో చైన్​స్నాచింగ్ కలకలం..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *