అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yemen Airstrike Deaths | యెమెన్ Yemen దేశంలో మళ్లీ బాంబుల మోత మోగింది. తైజ్ ప్రావిన్స్‌లోని అల్-వజియా జిల్లాలో శుక్రవారం తీవ్ర వైమానిక దాడి జరిగింది. ప్రజలతో కిటకిటలాడే రద్దీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ ఘోర దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Yemen Airstrike Deaths | రక్తాసిక్తమైన మార్కెట్..
అల్-వజియా జిల్లాలోని స్థానిక సంతలో ప్రజలు కొనుగోళ్లు జరుపుకుంటున్న సమయంలో హఠాత్తుగా బాంబుల వర్షం కురిసింది. ఊహించని ఈ దాడితో తీవ్ర కలకలం చెలరేగింది. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Yemen Airstrike Deaths | పరస్పర నిందలు..
ఈ మానవతా విపత్తుపై హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ నేతృత్వంలోని మద్దతు దళాలు పరస్పరం నిందలు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం తైజ్ ప్రావిన్స్ హౌతీల నియంత్రణలోనే ఉన్నప్పటికీ, ఈ ప్రాంత సరిహద్దుల్లో ప్రభుత్వ దళాలకు, తిరుగుబాటుదారులకు మధ్య నిరంతరం హోరాహోరీ పోరు సాగుతోంది. నిత్యం జరుగుతున్న ఈ పోరాటాల వల్ల అమాయకులైన పౌరులు బలికావడంపై ఐక్యరాజ్యసమితి, మానవ హక్కుల సంఘాలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..