అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi Judge Suicide | ఢిల్లీ న్యాయవ్యవస్థలో విషాదం చోటుచేసుకుంది. జడ్జి అమన్ శర్మ(30 )ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సఫ్దర్జంగ్ ఎన్‌క్లేవ్లో శనివారం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. డిల్లీ జ్యుడీషియల్ సర్వీస్‌లో ఆయన జూన్ 19, 2021 న చేరారు. పుణెలోని సింబయోసిస్ లా స్కూల్లో న్యాయ విద్య పూర్తి చేశారు. అనంతరం న్యాయవృత్తిలో అడుగుపెట్టారు.
Delhi Judge Suicide | పలు బాధ్యతలు..
తన సేవా కాలంలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (JMFC)గా, సివిల్ జడ్జిగా పనిచేస్తూ పలు సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించారు. అక్టోబర్ 2025 నుంచి కర్కర్డూమా కోర్టులోని ఉత్తర-తూర్పు జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన న్యాయవర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Mumbai Family Death Mystery | పుచ్చకాయ తిని.. ఒక ఫ్యామిలీ చనిపోయిందన్న కేసులో బిగ్ ట్విస్ట్!


[…] […]