అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad PETA Association | నిజామాబాద్ (Nizamabad) జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ( PETA TS) కార్యవర్గం కొలువుదీరింది. ఇటీవల రాష్ట్ర సంఘం నేతృత్వంలో జిల్లా కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి.
Nizamabad PETA Association | గతంలోనే అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక..
పేటా సంఘంలో గతంలోనే అధ్యక్ష కార్యదర్శులు పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. మిగతా కార్యవర్గాన్ని సోమవారం నగరంలోని టీఎన్జీవో భవనంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు డాక్టర్ అబ్బాపూర్ రవీందర్ వెల్లడించారు. పేటా సంఘం ఛైర్మన్‌గా జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, అధ్యక్షుడిగా డాక్టర్ రవీందర్ అబ్బాపూర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్.గంగాధర్, కోశాధికారిగా ఏగుట్ల రమేష్, మహిళా కార్యదర్శిగా ఎండల స్వప్న ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జి వెంకటేశ్వరరావు, పి అబ్బయ్య, ఈ క్రాంతి, ఎం గంగాధర్‌లు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ స్వామి కుమార్, బి రాజేశ్వర్, ఏం సురేష్ కుమార్, కే ప్రేమ్ కుమార్‌లు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా విజయ్ కుమార్ మోరే, ఈ సురేష్, పి గంగాధర్, యాకూబ్ అలీ అన్సారీ, పి నరేందర్, ఏ రాజేశ్వర్, రవి కాంత్, ఏం సంతోషి, భారతి, ఎస్ రజినిని ఎన్నుకున్నారు.
Nizamabad PETA Association | అనుబంధ విభాగాల ఎన్నిక పూర్తి..
పేటాకు అనుబంధంగా ఉన్న సంఘాల నుంచి ప్రతినిధులను ఎన్నుకోవడం జరిగిందని డాక్టర్ అబ్బాపూర్ రవీందర్ తెలిపారు. ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నుంచి అజ్మత్ ఖాన్, ఎన్ శ్రీనివాస్, ఆదర్శ పాఠశాలల నుంచి అప్పారావు, ఆర్ఎం ఎస్ఏ నుంచి బి మధుకర్, కేజీబీవీల నుంచి దీపికలు ఎన్నికయ్యారు.
ఇది కూడా చదవండి : గ్రీన్ ఎస్ఎం కార్ల వల్ల.. డ్రైవర్లు సూసైడ్ చేసుకోవాల్సిందే.