Nizamabad PETA Association | కొలువుదీరిన జిల్లా పేటా అసోసియేషన్​.. ఛైర్మన్​గా బొబ్బిలి నర్సయ్య

నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గం కొలువుదీరింది.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: Nizamabad PETA Association | నిజామాబాద్ (Nizamabad) జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ( PETA TS) కార్యవర్గం కొలువుదీరింది. ఇటీవల రాష్ట్ర సంఘం నేతృత్వంలో జిల్లా కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి.

Nizamabad PETA Association | గతంలోనే అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక..

పేటా సంఘంలో గతంలోనే అధ్యక్ష కార్యదర్శులు పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. మిగతా కార్యవర్గాన్ని సోమవారం నగరంలోని టీఎన్జీవో భవనంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు డాక్టర్​ అబ్బాపూర్​ రవీందర్​ వెల్లడించారు. పేటా సంఘం ఛైర్మన్​గా జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, అధ్యక్షుడిగా డాక్టర్ రవీందర్ అబ్బాపూర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్.గంగాధర్, కోశాధికారిగా ఏగుట్ల రమేష్, మహిళా కార్యదర్శిగా ఎండల స్వప్న ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జి వెంకటేశ్వరరావు, పి అబ్బయ్య, ఈ క్రాంతి, ఎం గంగాధర్​లు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ స్వామి కుమార్, బి రాజేశ్వర్, ఏం సురేష్ కుమార్, కే ప్రేమ్ కుమార్​లు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా విజయ్ కుమార్ మోరే, ఈ సురేష్, పి గంగాధర్, యాకూబ్ అలీ అన్సారీ, పి నరేందర్, ఏ రాజేశ్వర్, రవి కాంత్, ఏం సంతోషి, భారతి, ఎస్ రజినిని ఎన్నుకున్నారు.

Nizamabad PETA Association | అనుబంధ విభాగాల ఎన్నిక పూర్తి..

పేటాకు అనుబంధంగా ఉన్న సంఘాల నుంచి ప్రతినిధులను ఎన్నుకోవడం జరిగిందని డాక్టర్​ అబ్బాపూర్​ రవీందర్​ తెలిపారు. ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నుంచి అజ్మత్ ఖాన్, ఎన్ శ్రీనివాస్, ఆదర్శ పాఠశాలల నుంచి అప్పారావు, ఆర్ఎం ఎస్​ఏ నుంచి బి మధుకర్, కేజీబీవీల నుంచి దీపికలు ఎన్నికయ్యారు.

ఇది కూడా చదవండి : గ్రీన్ ఎస్ఎం కార్ల వల్ల.. డ్రైవర్లు సూసైడ్ చేసుకోవాల్సిందే. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *