Hyderabad Traffic Restrictions | సదర్​ ఉత్సవం.. రేపు నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు

సదర్​ ఉత్సవం నేపథ్యంలో నారాయణగూడ ప్రాంతంలో మంగళవారం ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తామని పోలీసులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Traffic Restrictions | హైదరాబాద్​ నగరంలో దీపావళి తర్వాత ప్రతి ఏటా సదర్​ ఉత్సవాలను యాదవ్​లు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా నారాయణగూడలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి. ఈ సారి కూడా నారాయణగూడలోని YMCA వద్ద ఈ నెల 10 (మంగళవారం) సాయంత్రం 7 గంటల నుండి 11న (బుధవారం) తెల్లవారుజామున 4 గంటల వరకు ‘సదర్ ఉత్సవ్ మేళా’ జరగనుంది. ఆ సమయంలో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేయనున్నారు.

Hyderabad Traffic Restrictions | ట్రాఫిక్​ మళ్లింపులు

సదర్​ ఉత్సవానికి పెద్ద ఎత్తున యాదవ్​లు, నాయకులు తరలిరానున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రామ్‌కోటి, లింగంపల్లి క్రాస్ రోడ్ల నుండి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వచ్చే వాహనాలను కాచిగూడ క్రాస్ రోడ్ల వద్ద టూరిస్ట్ హోటల్, సుల్తాన్ బజార్ వైపు మళ్లిస్తారు. విట్టల్‌వాడి క్రాస్ రోడ్ల నుంచి రాజ్‌మొహల్లా చిల్లా వైపు వచ్చే వాహనాలను పద్మశాలి భవన్ వద్ద మళ్లిస్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, శ్మశానవాటిక ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను విట్టల్‌వాడి క్రాస్ రోడ్ల వద్ద రామ్‌కోటి వైపు మళ్లిస్తారు.

Hyderabad Traffic Restrictions | వై జంక్షన్ వైపు

ఆర్టీసీ క్రాస్ రోడ్డు, క్రౌన్ కేఫ్ నుంచి YMCA వైపు వచ్చే వాహనాలను నారాయణగూడ క్రాస్ రోడ్ల వద్ద హిమాయత్‌నగర్ వై-జంక్షన్ వైపు మళ్లిస్తామని పోలీసులు తెలిపారు. నారాయణగూడ క్రాస్ రోడ్ల నుండి ఆర్‌బీవీఆర్‌ఆర్ (RBVRR) కాలేజీ వైపు వచ్చే వాహనాలను బాబా టెంట్ హౌస్ వద్ద మళ్లిస్తారు. బాగ్ లింగంపల్లి కాలనీలోని అంతర్గత వీధుల నుండి వచ్చే వాహనాలు రెడ్డి కాలేజీ జంక్షన్ వద్ద బాబా టెంట్ హౌస్ వైపు వెళ్లాలి. బర్కత్‌పుర చమన్ నుంచి వచ్చే వాహనాలను పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద క్రౌన్ కేఫ్ వైపు టర్న్​ తీసుకోవాలని పోలీసులు సూచించారు. కాచిగూడ క్రాస్ రోడ్ల నుండి పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను లింగంపల్లి క్రాస్ రోడ్ల వద్ద బర్కత్‌పుర చమన్ మీదుగా టూరిస్ట్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. టూరిస్ట్ జంక్షన్ నుండి లింగంపల్లి క్రాస్ రోడ్ల వైపు వచ్చే వాహనాలను అనుమతించరు.

దీనిని కూడా చదవండి : Borewell Water Flow | భూపాలపల్లిలో ఊహించని వింత.. మోటార్ లేకుండానే బోర్ల నుంచి వస్తున్న వాటర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *