అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడంగల్ నియోజకవర్గానికి నిధులు.. తీసుకు వెళ్తానని ఎవరైనా అడ్డు పడితే పండబెట్టి తొక్కుతానన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఇండస్ట్రీయల్ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. తన నియోజకవర్గానికి రూ.10 వేల కోట్లు తీసుకుంటానన్నారు. సీఎం ఇతర నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని, నిధులన్ని కొడంగల్‌కు తీసుకు వెళ్తున్నారని ఇటీవల పలువురు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులతో పాటు ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఇలాంటి విమర్శలు చేశారు. ఈ క్రమంలో సీఎం మాట్లాడుతూ.. కొడంగల్‌కు నిధులు అడ్డుకుంటే కేసీఆర్ కుటుంబం కావచ్చు, ఇంకా ఎవరైనా కావొచ్చు పండబెట్టి తొక్కుతామన్నారు. 2028 నాటికి కృష్ణా జలాలు తీసుకొచ్చి, కొడంగల్ భూములు సస్యశ్యామలం చేస్తానని ప్రకటించారు.
Revanth Reddy | పాలమూరుపై కక్ష
కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుంటే పాలమూరుపై కక్ష పెంచుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లలో రూ.8.15 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక వ్యవస్థల్ని గాడిన పెట్టామని, ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామన్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తీసుకువచ్చామన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును అడ్డుకుంటామని కేటీఆర్ తిరుగుతున్నారని విమర్శించారు. పది జన్మలెత్తిన కేటీఆర్ రేవంత్‌రెడ్డి కాలేరన్నారు. సంక్రాంతి తర్వాత ప్రజా బలం కార్యక్రమం నిర్వహిస్తానని సీఎం తెలిపారు. రాష్ట్ర నాలుగు మూలల తిరుగుతానని, ప్రజా బలంతోని సునామీ సృష్టిస్తామన్నారు.
KTR నువ్వు ఎన్ని జన్మలెత్తినా రేవంత్ కాలేవు.
నువ్వు ఎప్పటికీ ఉద్ధరాపేరు పెట్టుకున్నా తారక రామారావువే!
రేవంత్ కావాలంటే గుండె ధైర్యం ఉండాలి! 🔥💪
#RevanthReddy #KTR #Telangna https://t.co/dy6paZWJIO— Shashi Kumar Reddy Vura (@vurashashi) November 9, 2026
దీనిని కూడా చదవండి : Godavari Water Supply | గోదావరి అదనపు జలాల తరలింపునకు జలమండలి చర్యలు