Ratnadeep Retail IPO | పబ్లిక్ ఇష్యూకు నేషనల్ మార్ట్.. ‘రత్నదీప్’ ఐపీవోకు సెబీ ఆమోదం

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రత్నదీప్ రిటైల్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. త్వరలోనే ఐపీవో తేదీలు ఖరారయ్యే అవకాశాలున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ratnadeep Retail IPO | హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన రత్నదీప్ రిటెయిల్ లిమిటెడ్ ఆహారం, కిరాణా, వాల్యూ ఫ్యాషన్‌పై దృష్టి సారించి ఒక వ్యవస్థీకృత రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో 190 కిపైగా స్టోర్లను కలిగి ఉంది. రత్నదీప్ (సూపర్ మార్కెట్లు), రత్నదీప్ సెలెక్ట్ (ప్రీమియం ఫుడ్ స్టోర్లు), నేషనల్ మార్ట్ (హైపర్ మార్కెట్), స్టైల్ మార్ట్ (సరసమైన ధరల్లో ష్యాషన్ ఉత్పత్తులు) పేర్లతో వీటిని నిర్వహిస్తోంది.

Ratnadeep Retail IPO | విస్తరణ కోసం..

రత్నదీప్ రిటెయిల్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ప్రైమరీ మార్కెట్‌నుంచి నిధులు సమీకరించేందుకోసం ఈ కంపెనీకి సెబీ అనుమతించింది. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఈ కంపెనీ తాజా షేర్ల జారీ ద్వారా రూ.400 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు సందీప్ అగర్వాల్, మనీశ్ భార్తియా, మితేశ్ భార్తియా, యాస్ అగర్వాల్, కవితా అగర్వాల్ తమ వాటా షేర్లలో కొంతమేర (1.49 కోట్ల షేర్లు) విక్రయించనున్నారు. ప్రీ ఐపీవో ద్వారా రూ.70 కోట్ల విలువైన షేర్లను కంపెనీ జారీ చేసే అవకాశం ఉంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయంలోంచి రూ.40 కోట్లను కంపెనీ తీసుకున్న రుణాల చెల్లింపు కోసం, రూ,260 కోట్లను కొత్త స్టోర్లను ఏర్పాటు చేయడానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీవో తేదీలు, ప్రైస్ బ్యాండ్ ఖరారు కావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Balipadyami Stock Market | నేడు బలిపాడ్యమి.. స్టాక్ మార్కెట్లకు సెలవు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *