Strait of Hormuz | హోర్ముజ్ జలసంధిలో 3 చమురు ట్యాంకర్లు పేలుడు.. అమెరికాకు ఇరాన్ బిగ్ వార్నింగ్

అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వేదికగా మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Strait of Hormuz | అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వేదికగా మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తూ అనధికారిక మార్గాల్లో ప్రయాణిస్తున్న మూడు భారీ చమురు ట్యాంకర్లలో వరుసగా పేలుళ్లు సంభవించి అగ్నికి ఆహుతయ్యాయి. సముద్ర గర్భంలో అమర్చిన నేవల్ మైన్లు (మందుపాతరలు) తగలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దట్టమైన పొగలు హోర్ముజ్ ఆకాశాన్ని కమ్మేశాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారికంగా ప్రకటించింది. అమెరికా బలగాల సహకారంతో నావిగేషన్, గుర్తింపు వ్యవస్థలను నిలిపివేసి రహస్యంగా వెళ్లేందుకు ప్రయత్నించడం వల్లే ఈ తీవ్ర పరిణామం చోటుచేసుకుందని ఇరాన్ ఆరోపించింది.

Strait of Hormuz | ఇరాన్ గట్టి హెచ్చరిక..

ఈ పేలుళ్ల అనంతరం ఇరాన్ ( Iran ) నావికాదళం అమెరికా , దాని మిత్ర దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హోర్ముజ్ జలసంధిలో నిర్దేశిత నిబంధనలు పాటించకుండా, అమెరికా సహకారంతో అనధికారిక మార్గాల ద్వారా చమురు రవాణాకు ప్రయత్నించే నౌకలన్నింటికీ ఇదే గతి పడుతుందని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో సముద్ర గర్భంలో మైన్లు ఉన్నందున అనధికారిక ప్రయాణాలు అత్యంత ప్రమాదకరమని తేల్చిచెప్పింది. కాగా, ఈ చమురు ట్యాంకర్ల పేలుళ్లు , ఇరాన్ హెచ్చరికలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవడంతో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి:  Grandson Birthright Grandfather Property | తండ్రికి పంచిన తాత ఆస్తిపై మనవడికి జన్మహక్కు ఉండదు: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *