Vijayasai Reddy | సీఎం కొడుకే సీఎం కావాలా : విజయసాయి రెడ్డి

సీఎం కొడుకే మళ్లీ సీఎం కావాలా అని విజయ సాయి రెడ్డి ప్రశ్నించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijayasai Reddy | మాజీ ఎంపీ, పరివర్తన రాజనీతి పార్టీ (PRP) వ్యవస్థాపకుడు విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం కొడుకే, మళ్లీ సీఎం కావాలా అని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలు వద్దన్నారు. తాను సీఎం పదవిని ఆశించడం లేదని స్పష్టం చేస్తూ.. అన్ని సామాజిక వర్గాలలోని సమర్థులైన యువతకు నాయకత్వ అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.

విజయ సాయిరెడ్డి తన కొత్త పార్టీ పేరును బుధవారం విజయవాడ (Vijayawada)లో ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన పార్టీ ఎవరికీ బీ టీమ్​ కాదన్నారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసమో ఏర్పాటు చేసిన పార్టీ కాదని స్పష్టం చేశారు. ఏపీని రెండు పార్టీలే పాలించాలా అన్నారు.
రెండు పార్టీలు, రెండు కుటుంబాల ఆధిపత్యానికి ముగింపు పలకడమే PRP లక్ష్యం అన్నారు. TDP, YSRCP రెండింటికీ ప్రత్యామ్నాయంగా మూడో శక్తి అవుతామని, తాను CM పదవి ఆశించడం లేదని, మెంటార్‌గా మాత్రమే ఉంటానని తెలిపారు.

Vijayasai Reddy | అందుకే వైసీపీ ఓడిపోయింది

ఇటుక ఇటుక పేర్చి వైసీపీ నిర్మించటంలో తన కృషి కూడా ఉందని విజయ సాయి రెడ్డి అన్నారు. అయితే కొందరు తనకు ప‌ద‌వులు దానం చేశామ‌ని విమ‌ర్శిస్తున్నారన్నారు. కానీ, తన క‌ష్టంతో… తన నిబ‌ద్ధ‌త‌తోనే ఎంపీగా ఎదిగానని తెలిపారు. 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీ, 2024లో 11 సీట్లకు పడిపోవడానికి, నాయకత్వంలోని అహంకారమే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించేవారిని నాయకత్వం భరించలేదని విమర్శించారు. పార్టీలో తనకు గౌరవం దక్కలేదన్నారు. గౌరవం కోరుకునే వైసీపీ కార్యకర్తలు పీఆర్​పీలోకి రావాలని ఆహ్వానించారు. పార్టీలో తనను 74 సార్లు అవమానించారని, అందుకే పాత పార్టీకి, 4 ఏళ్ల రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Vijayasai Reddy New Party | కొత్త పార్టీ పేరు ప్రకటించిన విజయసాయి రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *