Modi Tattva | గుజరాత్ వర్సిటీలో ‘మోదీ’ పాఠం!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Tattva | గుజరాత్‌లోని ప్రముఖ విద్యాసంస్థ మహారాజా సాయాజీరావ్ యూనివర్సిటీ (MSU) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జీవితం, ఆయన నాయకత్వ శైలిపై ఒక ప్రత్యేక పాఠాన్ని విద్యార్థులకు బోధించనుంది.

Modi Tattva | కోర్సు వివరాలు

సోషియాలజీ (సామాజిక శాస్త్రం) విద్యార్థుల కోసం ‘సోషియాలజీ ఆఫ్ పేట్రియాటిజం’ (Sociology of Patriotism) పేరుతో ఒక కొత్త కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సులో భాగంగా ‘మోదీతత్వం’ (Moditattva) అనే ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చారు. ఇందులో ప్రధాని మోదీ నాయకత్వ లక్షణాలు, సమాజంపై ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రభావం గురించి వివరించనున్నారు.

Modi Tattva | ఇతర వీరుల పరిచయం

మోదీ గురించి మాత్రమే కాకుండా, దేశభక్తిని పెంపొందించే క్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ (Shivaji Maharaj), మహారాజా సాయాజీరావ్ గైక్వాడ్ వంటి మహనీయుల కృషిని, వారి రచనలను కూడా ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. ఈ నూతన కోర్సు ద్వారా విద్యార్థులకు దేశభక్తి, నాయకత్వ విలువలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. సోషియాలజీ ఆఫ్ భారత్, హిందూ సోషియాల, సోషియాలజీ ఆఫ్ పేట్రియాటిజం ఒక్కొక్కటి నాలుగు క్రెడిట్‌ల కోర్సులు. జూన్‌లో ప్రారంభమయ్యే రాబోయే విద్యా సంవత్సరం నుంmr ఎంఎస్‌యూలో సోషియాలజీ విద్య పునర్నిర్మాణంలో ఇవి ఒక భాగంగా ఉన్నాయి.

దీనిని కూడా చదవండి : Nashik BPO Case | టీసీఎస్​ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. నిందితురాలికి ముందస్తు బెయిల్​ నిరాకరణ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *