అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cigarette Price Hike | దూమపానం చేసేవారికి ఐటీసీ (ITC) కంపెనీ షాక్ ఇచ్చింది. తన బ్రాండ్ సిగరెట్ల ధరలను భారీగా పెంచింది. ఈ ఏడాది రెండో సారి ధరలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఐటీసీ నిర్ణయం ప్రకారం.. ఒక సిగరెట్ ప్యాకెట్‌పై రూ.10 మేర ధరలు పెరగనున్నాయి. తాజా పెంపుతో గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం సిగరెట్ ప్యాకెట్ ధర రూ. 125 నుంచి రూ. 135కి పెరిగింది. జూన్‌లో ఐటీసీ ఇదే ప్యాక్ ధరను రూ.115 నుంచి రూ.125కు పెంచింది. తాజాగా మరోసారి రూ.10 పెంచడంతో దూమపానం చేసేవారి జేబులకు చిల్లు పడనుంది. జూన్ నుంచి ఇప్పటి వరకు 17.4 శాతం ధరలు పెరిగాయి.
Cigarette Price Hike | ఖర్చులు పెరగడంతో..
అధిక పన్నులు, చట్టబద్ధమైన సిగరెట్ మార్కెట్లో అమ్మకాలపై ఒత్తిడితో సహా సిగరెట్ కంపెనీలు ఎదుర్కొంటున్న పెరుగుతున్న సవాళ్ల నేపథ్యంలో ధరలు పెంచినట్లు ఐటీసీ తెలిపింది. ఆపరేటింగ్ ఖర్చులు పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. పదేపదే ధరలు పెంచడం, డిమాండ్‌ను ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా మిగతా సిగరెట్ కంపెనీలు సైతం రేట్లు పెంచనున్నట్లు సమాచారం. ఐటీసీ సిగరెట్ ధరలు పెంచడంతో ఆ కంపెనీ షేర్లు స్టాక్మార్కెట్లో 1.5శాతం పెరిగాయి.
ఇది కూడా చదవండి : CII Partnership Summit | ప్రారంభమైన సీఐఐ సదస్సు.. హాజరైన కేంద్ర మంత్రి