తెలంగాణNalgonda Job Scam | దేవాలయ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నల్గొండలో రూ.20 కోట్ల...

Nalgonda Job Scam | దేవాలయ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నల్గొండలో రూ.20 కోట్ల స్కాం

దేవాలయాల్లో హుండీ లెక్కింపు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ముఠా గుట్టురట్టు అయింది. వెయ్యికి పైగా బాధితుల నుంచి సుమారు రూ.20 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nalgonda Job Scam | దేవాలయాల్లో హుండీ లెక్కింపు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ముఠా గుట్టురట్టు అయింది. వెయ్యి మందికి పైగా బాధితుల నుంచి సుమారు రూ.20 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Nalgonda Job Scam | నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని..

నల్గొండ (Nalgonda) జిల్లాలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా భారీ మోసానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దేవాలయాల్లో హుండీ లెక్కింపు(Hundi Counting) ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వెయ్యికి పైగా యువతీ యువకులను మోసం చేసి సుమారు రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పులి రవి అనే వ్యక్తి ఈ మోసానికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. ప్రభుత్వంతో సంబంధం ఉన్న దేవాలయాల్లో(Endowments Department) పర్మనెంట్ లేదా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను నమ్మబలికాడు. జిల్లాలోని పలు ప్రముఖ దేవాలయాల్లో హుండీ లెక్కింపు పనులు తమ ఏజెన్సీకే అప్పగించారని ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చాడు.

Nalgonda Job Scam | యాప్​లో అటెండెన్స్​

ఈ ప్రచారాన్ని నమ్మి వచ్చిన ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా దాదాపు 1,000 మందికి పైగా ఈ మోసానికి గురయ్యారు. బాధితులను పూర్తిగా నమ్మించేందుకు పులి రవి Puli Ravi సాంకేతికతను కూడా వినియోగించాడు. ‘సాలరీ బాక్స్’(Salary Box) అనే పేరుతో ఒక మొబైల్ యాప్ రూపొందించి, ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు అటెండెన్స్ నమోదు చేయాలని చెప్పాడు. దీంతో బాధితులు తాము నిజంగానే ఉద్యోగంలో చేరినట్లు భావించారు.

Nalgonda Job Scam | యాప్​ పేరుతో వసూళ్లు

ఇంతటితో ఆగకుండా, ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా ఒక్కొక్కరి నుంచి రూ.5,000 వసూలు చేయడం గమనార్హం. అయితే నెలలు గడిచినా జీతాలు రాకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దేవాలయ అధికారులను సంప్రదించగా అసలు అలాంటి ఏజెన్సీకి ఎలాంటి కాంట్రాక్ట్ ఇవ్వలేదని తెలిసి మోసం వెలుగులోకి వచ్చింది. మోసపోయిన బాధితులు తమ కష్టార్జిత డబ్బులు కోల్పోయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Inspectors Transfers | భారీగా ఇన్​స్పెక్టర్ల బదిలీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kavitha New Party | కేసీఆర్, కవితల మధ్య విభేదాలపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే వెబ్‌డెస్క: తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త...

Jewellery Robbery | తుపాకులతో బెదిరించి.. పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jewellery Robbery | కరీంనగర్​ (Karimnagar) లో...

Hyderabad Chit Fund Scam | చిట్టీల పేరుతో మరో భారీ మోసం.. కేటుగాళ్లపై బాధితుల ఫిర్యాదు!

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Chit Fund Scam| భాగ్యనగరంలో మరో ఆర్థిక...