అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad GGH | ఆస్పత్రిలో చోరీకి యత్నించిన ఓ వ్యక్తి నాలుగో అంతస్తు పైనుంచి జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో(GGH Nizamabad) చోటు చేసుకుంది.
Nizamabad GGH | చోరీకి వచ్చి..!
ఆస్పత్రిలో రోగుల బంధువులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జీజీహెచ్‌లోని నాల్గో అంతస్తులో ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. ఆ ఫ్లోర్లో మెడికల్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు తమ బ్యాగులను ఉంచుతారు. ఈ క్రమంలో చోరీకి యత్నించిన వ్యక్తిని ఫ్లోర్ ఇన్‌ఛార్జి గమనించాడు. దీంతో అనుమానిత వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో కిటికి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి కిందపడ్డారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం జీజీహెచ్‌లోనే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సంబంధిత వ్యక్తి వివరాలు తెలియరాలేదు. 1వ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: శివుడికి ఎంతో ఇష్టమైన 5 నైవేద్యాలు ..