Army Vehicle Accident | చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా..

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా పడి పలువురు జవాన్లు గాయపడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Army Vehicle Accident | రంగారెడ్డి జిల్లా (Rangareddy District) చేవెళ్ల మండలంలో ఆర్మీ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మంది జవాన్లు గాయపడ్డారు.

చేవెళ్లలోని అల్లావాడ గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది జవాన్లు గాయపడ్డారు. వారిలో 8 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.

Army Vehicle Accident | శిక్షణ కోసం వెళ్తుండగా..

గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి శిక్షణ కోసం సైనికులు వాహనంలో షాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో అల్లావాడ గేట్ సమీపానికి చేరుకోగానే వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అనంతరం చెట్టును ఢీకొంది. గాయపడిన జవాన్లను వెంటనే గోల్కొండ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి..: Ponnam Prabhakar Counter | రాహుల్​ పర్యటన.. కేటీఆర్​కు మంత్రి పొన్నం కౌంటర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *