Punjab Gun Culture | టపాసుల్లా బుల్లెట్లు పేలుస్తున్నారు.. పంజాబ్​లో గన్​ కల్చర్​పై గవర్నర్​ ఆందోళన

పంజాబ్​లో గన్​ కల్చర్​పై గవర్నర్​ గులాబ్​ చంద్​ కటారీయా ఆందోళన వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Punjab Gun Culture | పంజాబ్​లో ఇటీవల నేరాలు పెరిగాయి. ముఖ్యంగా కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకున్నాయి. కొందరు వ్యక్తులు పోలీసులపై సైతం కాల్పులు జరుపుతున్నారు. ఈ క్రమంలో గవర్నర్​ గులాబ్​ చంద్​ కటారీయా (Gulab Chand Kataria) కీలక వ్యాఖ్యలు చేశారు.

పంజాబ్‌లో తూటాలను టపాకాయల్లా తేలికగా పేలుస్తున్నారని గవర్నర్​ అన్నారు. లుధియానాలో జరిగిన సత్ పాల్ మిట్టల్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ప్రసగించారు. నేరాలు పెరుగుతుండటంతో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిని సంతృప్తికరంగా వర్ణించలేమని అన్నారు. గన్​ కల్చర్​పై తీవ్ర విమర్శలు చేశారు. చిన్న చిన్న వివాదాలు కూడా తుపాకుల వాడకానికి దారితీస్తున్నాయని, చిన్నపిల్లలు కూడా పిస్టళ్లను పట్టుకుని కాల్పులు జరుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Punjab Gun Culture | డ్రగ్స్​ ముప్పు

ధైర్యసాహసాలకు, దేశానికి చేసిన సేవలకు పేరుగాంచిన పంజాబ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల సమస్య బలహీనపరుస్తోందని కటారియా అన్నారు. డ్రగ్స్​ నిర్మూలన కోసం సామాజిక ఉద్యమం అవసరమని పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వానికి లేదా ఏ ఒక్క సంస్థకు వదిలివేయలేమని ఆయన తెలిపారు. వ్యసనంతో పోరాడుతున్న యువతను ద్వేషించవద్దని సమాజానికి విజ్ఞప్తి చేస్తూ, వారు ఈ సమస్యను అధిగమించి సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి సహయ పడాలని సూచించారు. డ్రగ్స్​పై పోరాటంతో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Yamuna River | యమున నదిలో చేపల మృతిపై వివాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *