అక్షరటుడే, కామారెడ్డి (భిక్కనూరు) : Bhiknoor Road Accident | అర్ధరాత్రి ప్రయాణం.. ఆపై నిద్ర మత్తు. వెరసి కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. అదృష్టవశాత్తూ కారులో ఉన్న ఏడాది పాప సహా ఐదుగురికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Bhiknoor Road Accident | ఎయిర్పోర్టు నుంచి వస్తుండగా..

డిచ్ పల్లి దగ్గర కొండాపూర్ గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ (Hyderabad) ఎయిర్ పోర్టులో బంధువులకు వీడ్కోలు పలికి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. కారులో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఏడాది, మూడేళ్ల చిన్నారులు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ప్రయాణం సాగుతుండగా డ్రైవర్ కు నిద్ర మత్తు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. భి క్కనూరు టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి ఒక్కసారిగా డివైడర్ పైకి దూసుకెళ్లింది. డివైడర్ ను ఢీకొనడంతో కారు ముందు భాగం దెబ్బతింది. శబ్దం విని చుట్టుపక్కల వాహనదారులు, టోల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కారులో ఉన్నవారిని బయటకు తీసి పరిశీలించగా ఎవరికీ గాయాలు కాలేదని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో ట్రాఫిక్ జామ్ కాగా టోల్ ప్లాజా సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేశారు. కారు పల్టీ కొట్టి ఉంటే పెనుప్రమాదం సంభవించేదని స్థానికులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Sarpanch Arrested | కామారెడ్డిలో అవినీతి పంచాయతీ.. నిధుల స్వాహా కేసులో సర్పంచి అరెస్టు!