అక్షరటుడే, కామారెడ్డి: Sarpanch Arrested | గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం వ్యవహారం కామారెడ్డి Kamareddy జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అధికార దుర్వినియోగం, అక్రమ బిల్లుల వ్యవహారం బట్టబయలు కావడంతో స్థానిక రాజకీయ వర్గాల్లో ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది.
Sarpanch Arrested | అవినీతి బాగోతం బట్టబయలైందిలా..
గ్రామ అభివృద్ధికి కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయంటూ గ్రామస్థులు నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్, వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఆరుగురు జిల్లా స్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
Sarpanch Arrested | డ్రైనేజీ పనుల్లో డబుల్ బిల్లింగ్ దందా..
విచారణ కమిటీ చేపట్టిన లోతైన తనిఖీల్లో సదరు సర్పంచు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గతంలో ఎంపీటీసీగా పనిచేసిన సమయంలోనూ నిధులను కాంట్రాక్టర్ పేరిట బదిలీ చేసి సొంతానికి వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా గ్రామంలో చేపట్టిన డ్రైనేజీ పనుల్లో భారీ అవినీతి జరిగినట్లు తేలింది. ఒకే పనికి రెండుసార్లు బిల్లులు పెట్టి ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్లు కమిటీ నిర్ధారించింది.
గత కొద్దిరోజులుగా సదరు సర్పంచి ఏకపక్ష తీరుపై గ్రామంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సొంత పాలకవర్గంలోని కొంతమంది వార్డు సభ్యులు సైతం సర్పంచి అవినీతిపై గళమెత్తుతూ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనలకు దిగారు.
Sarpanch Arrested | కలెక్టర్ కొరడా – పోలీసుల యాక్షన్
అధికారుల విచారణ నివేదికలో నిధుల దుర్వినియోగం రుజువు కావడంతో, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి సర్పంచిను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉంటూ నిధుల స్వాహాకు పాల్పడితే ఎంతటి వారైనా జైలు ఊచలు లెక్కించక తప్పదనే సంకేతాలు ఈ ఘటనతో వెళ్లాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అరెస్టు వ్యవహారం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..