Madapur Bhu Bharati Resurvey | మాదాపూర్‌లో భూభారతి రీ-సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్…

జక్రాన్‌పల్లి మండలం మాదాపూర్ గ్రామంలో జరుగుతున్న భూభారతి రీ-సర్వే ప్రక్రియను ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్​ మాల్వియా పరిశీలించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Madapur Bhu Bharati Resurvey | జక్రాన్‌పల్లి మండలం (Jakranpally Mandal) మాదాపూర్ గ్రామంలో జరుగుతున్న భూభారతి రీ-సర్వే ప్రక్రియను ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్​ మాల్వియా పరిశీలించారు. శనివారం గ్రామానికి చేరుకున్న ఆయన సర్వే బృందం చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Madapur Bhu Bharati Resurvey | భూముల కొలతలు, రికార్డుల నమోదు..

భూముల కొలతలు, రికార్డుల నమోదు, రైతుల నుంచి సేకరిస్తున్న వివరాలను సబ్ కలెక్టర్ అభిగ్యాన్​ మాల్వియా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్వే బృందానికి పలు సూచనలు చేశారు. రీ-సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. రోజువారీగా నిర్దేశించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సర్వేలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bhiknoor Road Accident | అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి డివైడర్​ను ఢీకొన్న కారు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *