అక్షరటుడే, వెబ్‌డెస్క్: U19 Asia Cup Final | అండర్-19 ఆసియా కప్ Asia Cup 2026 ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత Bharat యువ జట్టు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. శనివారం (నవంబర్ 14) జరిగిన తుది పోరులో ఆఖరి బంతి వరకు సాగిన నరాలు తెగే ఉత్కంఠలో భారత్ 1 వికెట్ తేడాతో జయభేరి మోగించింది. ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో 9వ సారి అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
U19 Asia Cup Final | ఓటమి అంచుల నుంచి అద్భుత విజయం
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ (107) సెంచరీతో చెలరేగగా, అబ్దుల్ ఖాదిర్ (80), కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ (63) అర్ధ సెంచరీలతో రాణించారు.
అయితే చివరి 6 ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకుని 6 వికెట్లు పడగొట్టడంతో పాక్ స్కోరు 340 లోపే పరిమితమైంది. భారత బౌలర్లలో కావ్య పటేల్ 4 వికెట్లు, చిగురుపాటి వెంకట 3 వికెట్లు తీశారు.
U19 Asia Cup Final | అద్భుత పోరాట పటిమ
338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయ్‌చందాని (80) చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 42 ఓవర్లలో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి భారత్ ఓటమి అంచున నిలిచింది. ఈ దశలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మనాల్ చౌహాన్, పదో నంబర్ బ్యాటర్ మోహిత్ ఉల్వా (26 బంతుల్లో 49 నాటౌట్) అద్భుత పోరాట పటిమ కనబరిచారు.
చివరి బంతికి విజయానికి 3 పరుగులు అవసరమైన వేళ, మోహిత్ ఉల్వా ఎక్స్‌ట్రా కవర్ దిశగా అద్భుతమైన బౌండరీ బాది భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో భారత్ సరిగ్గా 50 ఓవర్లలో 9 వికెట్లకు 339 పరుగులు చేసి ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన ఆర్యవీర్ సెహ్వాగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..