Bay of Bengal Cyclone | బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు..!

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా కదులుతోంది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bay of Bengal Cyclone | ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరం దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

అంతేకాకుండా మంగళవారం నుండి బుధవారం నాటికి మరింత తీవ్రరూపం దాల్చి తీవ్ర తుఫాన్‌గా మారొచ్చని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో వచ్చే గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కోస్తా తీర ప్రాంతాల ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Bay of Bengal Cyclone | మత్స్యకారులకు కీలక హెచ్చరికలు..

ప్రస్తుతం ఈ వాయుగుండం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా సుమారు 860 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1,040 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తున్న ఈ తుఫాన్, ఉత్తర కోస్తాంధ్ర వైపు కదిలి తీరం దాటే సూచనలు ఉన్నాయని, అయితే కచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందనే అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున, వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇవాళ సాయంత్రంలోగా తీరానికి చేరుకోవాలని ఐఎండీ స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని, ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..: Akvan Cyclone Telangana | తెలంగాణకు ‘అక్వాన్’ తుపాను ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *