Uttarakhand Bus Accident | లోయలో పడిన బస్సు.. ఆరుగురి మృతి

ఉత్తరాఖండ్​లో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttarakhand Bus Accident | ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో మంగళవారం దాదాపు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంద మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. గులార్ బజార్ సమీపంలో తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. హరిద్వార్ నుండి చమోలికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Uttarakhand Bus Accident | ఆస్పత్రికి తరలింపు

సహాయక బృందాలు సుమారు 20 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో సోమవారం రాత్రి ఒక బొలెరో వాహనం లోతైన లోయలోకి పడిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.

ఇది కూడా చదవండి..: NEET UG reforms | నీట్-యూజీ (NEET-UG) పరీక్షా విధానంలో సమూల మార్పులు.. బోర్డు మార్కులకు వెయిటేజీ, సీబీటీ పరీక్షలపై కసరత్తు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *