Paddy Procurement | సీఎం దూరదృష్టితోనే రైతులకు రికార్డుస్థాయి ధర

సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా నేడు రైతులకు రికార్డు స్థాయిలో ధర లభిస్తోందని రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Paddy Procurement | సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా నేడు రైతులు పండించిన ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర లభిస్తోందని రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి అన్నారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ అర్గుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

Paddy Procurement | బోనస్​తో..

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముందుచూపుతో రైతులకు 7 రకాల ధాన్యాన్ని సాగు చేయాలని సూచించారని భూపతిరెడ్డి తెలిపారు. ఆ నిర్ణయం వల్ల ప్రస్తుతం ఆయా రకాల ధాన్యానికి మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ధర లభిస్తోందని తెలిపారు. ఆనాడు ప్రతిపక్షాలు చేసిన విమర్శలు, ఆరోపణలు అర్థరహితమని నేటి ఫలితాలు నిరూపిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి రూ.2,461 మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ అందిస్తోందని, తద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందని పేర్కొన్నారు.

రైతులు తొందరపడి తక్కువ ధరకు ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించవద్దని, క్వింటాల్‌కు రూ.3,000 కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అర్గుల్ పీఏసీఎస్ ఛైర్మన్ గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంజయ్ రెడ్డి, నాయకులు సాయిరెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి,రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Indiramma Towers  | ‘ఇందిరమ్మ టవర్స్‌’లో ప్లాట్ల కోసం విశేష స్పందన..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *