Voter list revision | ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు.. తెలుగు రాష్ట్రాలకు కొత్త షెడ్యూల్ విడుదల

నవంబర్ 18 నుంచి నవంబర్ 30 వరకు క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓ) ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించనున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Voter list revision | దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంచి, లోపాలను సరిదిద్దేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక అడుగు వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియకు సంబంధించి ఈసీఐ కొత్త షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు (సీఈఓ) కమిషన్ తాజాగా లేఖలు పంపింది.

Voter list revision | కొత్త షెడ్యూల్ వివరాలు ఇవే..

కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మూడు ప్రధాన దశల్లో జరగనుంది.

ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ: నవంబర్ 18 నుంచి నవంబర్ 30 వరకు క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓ) ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించనున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

అభ్యంతరాల పరిష్కారం: ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చే అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ 15 వరకు కొనసాగుతుంది.

తుది జాబితా ప్రచురణ: అన్ని పరిశీలనలు, సవరణలు పూర్తయిన అనంతరం డిసెంబర్ 22న ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రచురించనున్నారు.

Voter list revision | అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

నిర్దేశిత గడువులోగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీఐ అధికారులను ఆదేశించింది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలనుకునే యువత, చిరునామా మార్పు లేదా తప్పుల సవరణ కోరుకునే పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *